చైతన్య అంటే ప్రేమ.. కానీ అది ఇష్టం లేక విడాకులు తీసుకున్న సమంత.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు ఎందిగిపోయింది. కెరీర్ పరంగా ఆమె తన లైఫ్ ఎలా సంతోషంగా సాగించిందో, పర్సనల్ లైఫ్ మాత్రం అంత డిస్టర్బ్‌గా సాగిందనే చెప్పవచ్చు. నాగచైతన్యతో ప్రేమ పెళ్లి నుంచి మొదలు పెడితే, డివోర్స్, మయసైటీస్ ఇవన్నీ తన జీవితంలో సమస్యలనే తీసుకొచ్చాయి.
ఇష్టపడి చేసుకున్న పెళ్లినే కొన్ని రోజులకు కష్టంగా మారింది. ఒకరికి ఒకరు కరెక్ట్ కాదు అనే భావన ఏర్పడింది. చివరకు విడాకులకు కారణం అయ్యింది. ఇక ఈ బాధను తట్టుకోవడం, మానసికంగా వీక్ అవ్వడం, మయోసైటీస్ బారిన పడటం ఇవన్నీ సమంత జీవితంలో ఊహించని పరిణామాలు. అప్పటి వరకు ఒక్క డిజాస్టర్ కూడా లేకుండా తన లైఫ్‌ను బిజీ బిజీగా సంతోషంగా గడుపుకుంటూ వెళ్లిన సమంత.. డివోర్స్ తర్వాత మాత్రం తన లైఫ్ మొత్తం మారిపోయింది. అయితే చాలా మందికి అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది ఏమైనా ఉందా అంటే అది వీరు డివోర్స్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పటికీ దీనికి సరైన సమాధానం మాత్రం తెలియడం లేదు.
కానీ దీనిపై ఎన్నో రూమర్స్ మాత్రం పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. సమంత విడాకుల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. సమంతనే ముందుగా విడాకులు కోరిందని, చైతూను నువ్వు నాకు తప్పకుండా డివోర్స్ ఇవ్వు. ఇంత కష్టంగా ఉంటూ కలిసి ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్.. ఏంటి.. సమంతనే మొదట డివోర్స్ అడిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.