ఆ పుకార్లపై స్పందించిన Sai Pallavi

స్టార్ నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Update: 2023-01-08 08:44 GMT

దిశ, సినిమా : స్టార్ నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ చివరగా 'విరాట పర్వం' మూవీలో కనిపించింది. తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. దీంతో సాయిపల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సాయిపల్లవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాల గురించి క్లారిటీ ఇచ్చింది. 'అందం అన్నది రూపంలో కాదు గుణంలో ఉంటుందని చెప్పిన చిత్రం 'ప్రేమమ్'. ఈ సినిమాతో నా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఈ మూవీ సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. నేను ఎంబీబీఎస్ చదివినా.. నటి కావాలనుకున్నప్పుడు నా కుటుంబం ఏమాత్రం అడ్డుపడలేదు. అదే విధంగా నేను ఇప్పటివరకూ నటించిన ప్రతి ఒక్క చిత్రంలోని నా పాత్ర అభిమానులకు నచ్చాలనే కోరుకుంటా. ప్రేక్షకులు కూడా నన్ను తమ ఇంటి ఆడపడుచుగా భావించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ నచ్చిన కథలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నా' అని స్పష్టం చేసింది. 

Also Read.. 

ఏడుస్తున్నప్పుడు కూడా దయను కలిగివుండాలా? సమంత పోస్ట్ వైరల్ 

Tags:    

Similar News