pawan kalyan: పవన్ కల్యాణ్ కారణంగా బలైంది కేవలం రేణు దేశాయ్ మాత్రమే కాదండోయ్.. లిస్ట్ పెద్దగానే ఉందిగా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు.

Update: 2024-07-21 15:33 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. కేవలం ఆయన యాక్టింగ్‌తోనే కాకుండా మంచి మనసుతో కూడా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ పవర్ స్టార్ వెనకడుగెయకుండా రీసెంట్గా జరిగిన ఏపీ ఎలక్షన్స్‌లో మళ్లీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇదంతా పక్కన పెడితే.. పవన్ అంటే పడనివారు సోషల్ మీడియాలో ఈయనపై పలు కామెంట్లు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బద్రి చిత్రంలో పవన్ కల్యాణ్ అండ్ తన మాజీ భార్య రేణు దేశాయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కెరీర్ లో మంచి అవకాశాలు దక్కించుకునే సమయంలోనే రేణు.. పవన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇక సినిమా అవకాశాలను కోల్పోయిందంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అలాగే ‘ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి’ సినిమాలోని హీరోయిన్ సుప్రియ, సూపర్ హిట్ గా నిలిచిన సుస్వాగతం చిత్రంలోని దేవయాని, ఇప్పటికీ యూత్ ఫెవరేట్ మూవీ ‘తొలిప్రేమ’ కథానాయిక కీర్తి రెడ్డి.

‘తమ్ముడు’ మూవీ హీరోయిన్ ప్రీతి జింగానియా, ‘బద్రి’ మూవీలో అమీషా పటేల్, ‘గుడుంబా శంకర్’ లో నటించిన మీరా జాస్మిన్, బంగారం హీరోయిన్ మీరా చోప్రా, ‘జల్సా’ చిత్ర కథానాయిక ఇలియానా. పులి మూవీలో నటించిన నికీషా పటేల్, పంజాలోని సారా జేన్ దియాస్, ‘అజ్ఞాతవాసి’ చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. ఈ హీరోయిన్లకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయని, ఇందులోని పలువురు హీరోయిన్లు పూర్తిగా సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పారంటూ పలువురు జనాలు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Similar News