PAWAN KALYAN-NIHARIKA:పవన్ కల్యాణ్ ఫోన్ నెంబర్ నిహారిక ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకుంది.. షాక్‌లో ఫ్యాన్స్!

ప్రముఖ నటుడు, నిర్మాత అయిన నాగబాబు గారాల పట్టి నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

Update: 2024-07-22 13:49 GMT

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, నిర్మాత అయిన నాగబాబు గారాల పట్టి నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈమె అంటే మెగా ఫ్యామిలీలో అందరికీ గారాబమే. ‘ముద్దపప్పు ఆవకాయ్(షార్ట్ ఫిలిం), ఒక మనసు, నాన్న కూచి, ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్, హ్యపి వెడ్డింగ్, హ్యపి వెడ్డింగ్, సైరా నరసింహారెడ్డి, సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ సినిమాలన్నీ పెద్దగా హిట్ కాకపోయిన నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. నిహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి.. ప్రేక్షకుల ఆదరణ పొందింది.

ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతుంది. కమిటీ కుర్రాళ్లు అనే మూవీని నిర్మిస్తోంది.ఆగస్టు 9 న తెరకెక్కె ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మెగా డాటర్ నిహారిక ప్రముఖ నటుడు.. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి చెప్పుకొచ్చింది. ‘పవన్ కల్యాణ్ బాబాయి మాకు ఎప్పటికీ స్పెషలే. ఫ్యామిలీలో అందరం ఆయనను గౌరవిస్తాం. పవన్ బాబాయి స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మోటివేట్ చేశాయి కూడా. ఒక నటుడి కన్నా ఆయన్ను ఒక రాజకీయ నాయకుడిగానే నేను ఇష్టపడతాను’ అని వెల్లడించింది.

అలాగే పవన్ కల్యాణ్ నెంబర్ మీ ఫోన్ లో ఏమని సేవ్ చేసి ఉంటుందని అడగ్గా.. kkk ఉంటుందని నిహారిక బదులిచ్చింది. kkk అనగా కొణిదెల కళ్యాణ్ కుమార్ అని వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. మరీ కొంతమంది మెగా ఫ్యామిలీ గారాట పట్టి కాబట్టి నిహారిక అందరిని సరదాగా నేమ్స్‌తో పిలుస్తుందని పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 


Read more...

VIJAY DEVARAKONDA:విజయ్ దేవరకొండ ప్రైవేటు ఫొటోలు లీక్.. బెడ్‌పై పడుకుని అమ్మాయితో..! 


Similar News