యాంకర్‌పై మనసు పారేసుకున్న విశ్వక్ సేన్.. ఆ విషయంలో హీరోయిన్స్ కంటే అంటూ (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ కొద్ది సమయంలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎక్కువగా వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ కొద్ది సమయంలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎక్కువగా వివాదాస్పద కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గామి వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
అందులో యాంకర్ స్రవంతి ని పొగుడుతూ విశ్వక్ కామెంట్స్ చేశాడు. ఇక చాలా బాగుంది అంటూ స్రవంతి ఏదో చెప్పబోతుంటే.. ఇంతలోనే విశ్వక్.. ‘‘మీరు ఈ మధ్య హీరోయిన్స్ కన్నా మంచి చీరలు కడుతున్నారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి ఆమె థాంక్స్ చెబుతూ నవ్వేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నీ కన్ను ఆమెపై పడిందా ఆమె షోలు పడ్డట్లే అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.