తుపాకీ పట్టిన సాయిపల్లవి..

దిశ, సినిమా : రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్లవి జంటగా న‌టించిన ‘విరాట ప‌ర్వం’ మూవీ రెండేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది.

Update: 2022-06-08 14:17 GMT

దిశ, సినిమా : రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్లవి జంటగా న‌టించిన 'విరాట ప‌ర్వం' మూవీ రెండేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ వాయిదాపడగా.. ఆ మధ్య ఓటీటీలో రిలీజ్ చేస్తార‌నే టాక్ కూడా వినిపించింది. కానీ థియేట‌ర్‌ రిలీజ్‌కు సిద్ధమైన తర్వాత వ‌రుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆస‌క్తి పెంచుతున్నారు మేకర్స్. వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కానుండగా.. సాయి ప‌ల్లవి 'వెన్నెల' పాత్రలో క‌నిపించనుంది. న‌క్సలైట్ ర‌వ‌న్న(రానా) ర‌చ‌న‌ల‌కు అభిమానిగా మారిన వెన్నెల.. తనను ఎలాగైనా క‌లుసుకునేందుకు అడవికి వెళ్తుంది. రవన్నను క‌లిశాక ఆమె కూడా ఉద్యమం వైపు అడుగులేస్తుంది. ఈ మేరకు కొన్ని యాక్షన్ సీన్స్‌లో తుపాకీ ప‌ట్టుకుని కనిపించింది. అయితే తాను ఇప్పటి వరకు సినిమాల్లో చేసిన డ్యాన్సులు, సీన్లు ఒక ఎత్తయితే.. 'విరాట ప‌ర్వం' మాత్రం వేరే లెవెల్ అంటోంది. ఇది ఓ కొత్త అనుభ‌వమని, ఇకపై బ‌ల‌మైన క‌థాంశం గల సినిమాల్లోనే న‌టిస్తాన‌ని చెప్పింది.

Tags:    

Similar News