హీరోలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రాగానే సీఎంలు అయిపోరంటూ ఫైర్!

లేడీ పవర్ స్టార్ , సీనియర్ హీరోయిన్ విజయ శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా విజయశాంతి నటించిన కర్తవ్యం

Update: 2024-07-09 16:13 GMT

దిశ, సినిమా : లేడీ పవర్ స్టార్ , సీనియర్ హీరోయిన్ విజయ శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా విజయశాంతి నటించిన కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ సినిమాలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అంతే కాకుండీ ఈసినిమాల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చిరు, విజయశాంతి జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసి 20కి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమా వస్తుందంటే అది బ్లాక్ బస్టర్ హిట్టే ఆరోజుల్లో. అయితే వీరిద్దరి మధ్య కూడా మంచి బంధం ఉంటుంది.

అయితే తాజాగా విజయశాంతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె హీరోలపై, పరోక్షంగా చిరుపై చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హీరోలు స్పందించాలని, ఈ ప్రజల ఆధారణ బట్టే వారు అంత పెద్ద హీరోలు అయ్యారు, మీరు వారి గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారని, యాంకర్ అడగ్గా, విజయశాంతి స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరూ స్పందించలేరని, వారికి వారి స్వార్థం ముఖ్యం, సినిమాల్లోనే హీరోలు వారు, బయట కాదు, నిజమైన హీరోలైతే న్యాయం వైపు నిలబడాలి, పార్టీ పెట్టి సీఎం అయిపోవాలంటే కుదరదు. సమాజ సేవ చేయాలి, కష్టపడాలి, స్వార్థంతో ముందుకు వెళ్లడం కాదుం అంటూ పరోక్షంగా చిరుపై పలు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News