చిరంజీవి నన్ను వాటికి పిలవరు.. చిరుపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. లేడీ ఫైటర్‌గా తాను ముద్ర వేసుకుంది. ఇక నటి చిరంజీవి, బాలకృష్ణ
దిశ, సినిమా : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. లేడీ ఫైటర్‌గా తాను ముద్ర వేసుకుంది. ఇక నటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సీనియర్ హీరోల చాలా మంది సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.
అయితే విజయశాంతి లేటేస్ట్ ఓ ఇంటర్వ్యూ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను చిరంజీవితో కలిసి చేయడం గరించి మాట్లాడుతూ అది ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే యాంకర 80 బ్యాచ్‌కు చెందిన ఆర్టిస్టులంతా ప్రతి సంవత్సరం ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తుంటారు కదా మీరు ఆ పార్టీకి ఎందుకు వెల్లలేదు అని ప్రశ్నించింది. దానికి విజయశాంతి సమాధానం ఇస్తూ.. నన్ను చిరంజీవి ఎప్పుడూ ఆ పార్టీలకు పిలవలేదు. పిలిచినా నేను వెళ్లను, అలాంటి పార్టీలకు నేను చాలా దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. షూటింగ్, రాజకీయాలు, ఇళ్లు అంతే తప్పితే పార్టీలకు వెళ్లను అంటూ స్పష్టం చేసింది. అందుకే అలాంటి పార్టీస్‌కు చిరు నన్ను పిలవరు, వాటిల్లో నేను కనిపించను అని తెలిపింది. ఇక ప్రస్తుతం విజయశాంతి కళ్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.