విజయ్ ఆంటోనీ ఇంట్రడక్షన్ ‘తుఫాన్’ ట్రైలర్
హీరో విజయ్ ఆంటోని తాజా చిత్రం తుఫాన్.
దిశ, సినిమా: హీరో విజయ్ ఆంటోని తాజా చిత్రం తుఫాన్. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై విజయ్ ఆంటోని హీరోగా నటించిన “రాఘవన్”, “హిత్య” చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంస్థ నుండి వచ్చిన తాజా చిత్రం "తుఫాను". ఈ చిత్రం పూర్తిగా పోయేటిక్ యాక్షన్ ఫిల్మ్ జానర్.
విజయ్ మిల్టన్ ఎక్కడా తగ్గకుండా కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతే కాకుండా, ఈ చిత్రాన్ని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదలైన తుఫాన్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇంట్రడక్షన్ ఈవెంట్ ను నిర్వహించారు.
దర్శకుడు విజయ్‌మిల్టన్ మాట్లాడుతూ - ''తుఫాన్ ట్రైలర్‌ను ఇంత గ్రాండ్‌గా జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన హీరో, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. భాష్యశ్రీ అందించిన డైలాగ్స్ చూస్తుంటే తూఫాన్ తెలుగు స్ట్రైయిట్ సినిమా అనేంతగా రాసాడంటూ ప్రశంసించారు. హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ " తెలుగులో మీరు చూపే ప్రేమ ఎనలేనిది. నేను మీతో సినిమా చూడాలనుకుంటున్నాను. ఈ చిత్రానికి దర్శకుడు విజయ్ మిల్టన్ ,నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.