'Veera Simha Reddy' మూవీ సెకండ్ సాంగ్ రిలీజ్..
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మూవీ 'వీర సింహా రెడ్డి'. బాలయ్యకి బాగా నచ్చే, అచ్చొచ్చే
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మూవీ 'వీర సింహా రెడ్డి'. బాలయ్యకి బాగా నచ్చే, అచ్చొచ్చే ఫ్యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత విడుదల చేసిన 'జై బాలయ్య' సాంగ్ అయితే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక రీసెంట్‌గా మరో సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్..''సుగుణ సుందరి'' అంటూ సాగే ఈ పాట చాలా క్యాచీ గా ఉంది. థమన్ మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సాంగ్ మూవీపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. పాటలో బాలయ్య డ్రెస్సింగ్ మాత్రం అదిరిపోయింది. శృతి హాసన్ కూడా వెరీ ఎనర్జీగా కనిపిస్తుంది.