సౌత్ ఇండియన్ హీరో అని పిలిస్తే ఆనందంగా ఉంది: Varun Dhawan

'నార్త్ ఇండియన్ స్టార్‌ల కంటే సౌత్ ఇండియన్ హీరోలే ఎక్కువున్నారు' అనే మాటలు విన్న తర్వాత దక్షిణాది సినిమా చేయాలనిపిస్తోంది'

Update: 2022-12-11 12:09 GMT

దిశ, సినిమా: 'నార్త్ ఇండియన్ స్టార్‌ల కంటే సౌత్ ఇండియన్ హీరోలే ఎక్కువున్నారు' అనే మాటలు విన్న తర్వాత దక్షిణాది సినిమా చేయాలనిపిస్తోంది' అని వరుణ్ ధావన్ తెలిపాడు. అంతేకాదు తనను కొంతమంది సౌత్ ఇండియన్ హీరో అని పిలిచారని, దీంతో విభిన్న ప్రాంతీయ చిత్రాల్లో నటించాలనే కోరిక మరింత రెట్టింపైనట్లు తెలిపాడు. ఇటీవల 'బేధియా'తో ప్రేక్షకుల మందుకొచ్చిన నటుడు రీసెంట్ ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ దక్షిణాది దర్శకులతో కలిసి పనిచేయాలనే ఆకాంక్ష ఉన్నట్లు తెలిపాడు.

'బేధియా'ను తెలుగులో 'తోడేలు' పేరుతో విడుదల చేశాం. అయితే లాంచ్‌ ఈ వెంట్‌లో 'మీ ఎనర్జీ లెవెల్ చూస్తే నార్త్ ఇండియన్ హీరో కంటే సౌత్ ఇండియన్ హీరోలా ఉన్నావ్' అని చాలామంది చెప్పారు. కానీ, నేనెప్పుడూ తేడా చూడలేదు. అవకాశం ఇచ్చినప్పుడు సౌత్‌లో పని చేయడానికి ఇష్టపడతా' అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ విషయంపై ఓ సమావేశంలో ప్రస్తావించిన నిర్మాత కరణ్ జోహార్.. 'వరుణ్ సౌత్ మూవీస్ చేయాలని చచ్చేంత పిచ్చితో ఉన్నాడు. హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లి నివసించాలనుకుంటున్నాడు' అని చెప్పడం విశేషం.

Tags:    

Similar News