Varun Tej and Lavanya Tripathi : పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న వరుణ్, లావణ్య.. ఎప్పుడంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ జూన్ 9న జరిగిన విషయం తెలిసిందే.

Update: 2023-06-13 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ జూన్ 9న జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలిపారు. ఇక ఎంగేజ్మెంట్ అనంతరం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..

వరుణ్, లావణ్యల పెళ్లి హైదరాబాద్ లోనే చేస్తారట. అయితే మొదట రాజస్థాన్‌లోని భోజ్ పూర్‌లో వివాహం జరుగుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. నిహారిక పెళ్లి కూడా అక్కడే జరగడంతో వారు విడిపోవడంతో అచ్చిరాలేదని అందుకే వరుణ్ పెళ్లి మాత్రం హైదరాబాద్‌లోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఫలక్‌నుమా ప్యాలస్‌లో వివాహం జరిపేందుకు సన్నాహాల చేస్తున్నారట. అంతే కాకుండా వారి వివాహానికి అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఈ మేరకు శ్రావణ మాసంలో డేట్ ఫిక్స్ చేసేలా ఇరు కుటుంబీకులు చర్చలు చేస్తున్నారని నెట్టింట టాక్. కాగా.. ఇది ఎంత వరకు నిజమనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:   అందరిముందే అక్కడ చేతులేసి నొక్కాడు.. సోనమ్ కపూర్ 

పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ వీడిపోవడానికి నాగబాబు కారణమా..? ఇన్నేళ్లకు బయటపడ్డ రహస్యం

Tags:    

Similar News