అందమైన బీచ్ రిసార్ట్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్!

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ , ముంబై గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. థాయిలాండ్‌లోని క్రాబీలోని అందమైన బీచ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లిని జరుపుకుంది.

Update: 2024-07-11 15:50 GMT

దిశ, సినిమా : నటి వరలక్ష్మీ శరత్ కుమార్ , ముంబై గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. థాయిలాండ్‌లోని క్రాబీలోని అందమైన బీచ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లిని జరుపుకుంది. వీరి మ్యారేజ్ దక్షిణ భారతీయ సంప్రదాయ పద్ధతిలో జరగ్గా వీరు బీచ్ వేధికగా సాయత్రం వేళ దండలు మార్చుకొని, ప్రమాణాలు చేసుకున్నారు. అంతే కాకుండా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం అత్యంత తక్కువ మంది సన్నిహితుల మధ్య, హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యశోధ సినిమాలో కీలక పాత్రలో నటించి ఈమె మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా హనుమాన్ సినిమాలో కూడా వరలక్ష్మీ కీలక పాత్రపోషించింది. ఇక ఈ నటి తమిళ హీరోతో లవ్‌లో ఉన్నదంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ కొట్టిపారేస్తూ చిరకు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.


Similar News