హీరోయిన్ త్రిషతో ఎఫైర్.. భార్యకు విడాకులు ఇవ్వబోతున్న స్టార్ హీరో!

కోలివుడ్ ఓ వార్త సునామీ సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరూ షాక్‌కు గురి అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా? ఎంతగానో అభిమానించే సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Update: 2024-07-06 09:18 GMT

దిశ, సినిమా : కోలివుడ్ ఓ వార్త సునామీ సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరూ షాక్‌కు గురి అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా? ఎంతగానో అభిమానించే సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ వధువు ఎవరూ అనుకుంటున్నారా? స్టార్, సీనియర్ హీరోయిన్ త్రిష. విజయ్, త్రిష చాలా రోజుల నుంచి లవ్‌లో ఉన్నారని టాక్. అయితే విజయ్ భార్య సంగీత అంటే అతనికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ తన భార్యతో కలిసి ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలో నైనా సరే ఒక్కడే కనిపిస్తున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండటం లేదు. వీరు విడి విడిగా ఉంటున్నారు, త్వరలో విడాకులు కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ఈ రూమర్స్‌పై స్పందించిన సంచలనాల సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు, అంతే కాకుండా స్టార్ హీరోయిన్ త్రిషను త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.విజయ్ తన పుట్టిన రోజు భార్యతో కాకుండా, త్రిషతో లిఫ్ట్‌లో దిగిన ఫోటోనే ఇందుకు నిదర్శనం.ఇదే కాకుండా, రాజకీయాలలో కూడా త్రిష విజయ్‌కు సపోర్టివ్‌గా ఉంటుంది.తమిళ రాజకీయాల్లో జయలలిత,ఎంజీఆర్‌లా , విజయ్, త్రిష బంధం ఉండబోతుందని బాంబ్ పేల్చింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే దీనిపై స్పందించిన అతని అభిమానులు మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. సుచిత్రపై ఫైర్ అవుతున్నారు. విజయ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు,2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించాడు అందుకే కావాలనే ఆయనను నెగిటివ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు.కాగా, ఈ వార్తపై త్రిష కానీ విజయ్ కానీ స్పందిస్తే అసలు క్లారిటీ రానుంది అంటున్నారు కొందరు.


Similar News