ఆమెతో శృంగారం చేసే టైంలో వణుకు పుట్టింది.. Tamannaah ప్రియుడి కామెంట్స్ వైరల్

బాలీవుడ్ నటుడు.. తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ‘జానే జాన్’ అనే పేరుతో ఓ వెబ్‌ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2023-09-21 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు.. తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ‘జానే జాన్’ అనే పేరుతో ఓ వెబ్‌ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నెటిఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా విజయ్ వర్మ కరీనా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీనాతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఓ అద్భుతమైన నటి. మంచి మనసు కలిగిన వ్యక్తి. తను ఎంత అందంగా ఉంటుందో అంతే అద్భుతంగా నటించగలదు. కానీ కరీనాతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే టైంలో నా శరీరంలో వణుకు పుట్టింది.’ అంటూ విజయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి

ఇవి కూడా చదవండి : పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ రాహూల్

Tags:    

Similar News