నేడు అక్కినేని నాగార్జున సతీమణి అమల బర్త్ డే.. నెట్టింట వెల్లువెత్తుతోన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు
నేడు (సెప్టెంబరు12) అక్కినేని నాగార్జున సతీమణి అమల పుట్టినరోజు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు (సెప్టెంబరు12) అక్కినేని నాగార్జున సతీమణి అమల పుట్టినరోజు. ఈ సందర్భంగా అమలకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అమల భరతనాట్య కళాకారిణిగా కెరీర్ ప్రారంభించి.. తర్వాత నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మైథిలి ఎనై కథలి, పుష్పక విమానం, ఉలడక్కమ్, వైశాలి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి సినిమాల్లో నటించే క్రమంలోనే అక్కినేని హీరో నాగార్జునతో ప్రేమలో పడింది. తర్వాత ఇరుకుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అమల అక్కినేని కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక అమలకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. ఈమె ఆరేళ్ల వయసులోనే ఓ కాకికి దెబ్బతగిలి ఇంటిముందు పడిపోతే.. దానికి కట్టుకట్టి పక్షికి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇక అప్పటి నుంచి అమల మూగ జీవాల మీద ప్రేమ పెంచుకుంటూనే వస్తుంది.