నా జీవితంలో అవే చీకటి రోజులు : సమంత

రీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో పడింది.

Update: 2024-03-24 12:07 GMT

దిశ, సినిమా: రీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో పడింది. ప్రజంట్ బాలీవుడ్ ప్రాజుక్ట్ ‘సిటడెల్‌’ కోసం ఎంతో కష్టపడుతున్న సామ్ తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.. ‘ ఇలాంటి వ్యాధి నాకే ఎందుకు వచ్చింది అని ఎన్నోసార్లు బాధ పడ్డాను. ఏ వారానికి ఆ వారం తగ్గుతుందిలే అనుకున్నా..కానీ ముదురుతూ పొయింది. ఏడాదిన్నరగా దీంతో పోరాడుతున్నానంటే నమ్మలేకపోతున్నా.

కానీ మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చని నమ్మకం కలిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి. ఓర్పుతో ముందుకు వెళ్తే జీవితం అందంగా ఉంటుంది. నాకు వచ్చిన వ్యాధి తగ్గడానికి సమయం పడుతుందని తెలుసు. కోలుకోవడానికి ఏం చేయాలో దాన్ని శ్రద్ధగా చేస్తున్నా.13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న. ఒకే సంవత్సరంలో 5 సినిమాలు విడుదలైన సందర్భాలూ కూడా ఉన్నాయి. ఇక ‘సిటడెల్‌’ లో ఎన్నో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. ఇది ఎంతో శారీరక శ్రమతో కూడినదని తెలిసినా ఓకే చెప్పా. దర్శక నిర్మాతలు నాకు ఎంతో సహకరించారు. ఈ సిరీస్‌ కోసం ఎంత కష్టపడి పని చేశానో నాకు తెలుసు. దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న’ అంటూ తెలిపింది సమంత.


Similar News