దిశ, సినిమా: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ సినిమా కూడా చెస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ లో మొదట మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ను కీ రోల్ కోసం తీసుకోగా.. డేట్స్ సర్దుబాటు కాని కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలిపారు మేకర్స్. కాగా తాజాగా ఇప్పుడు మరో హీరో కూడా తప్పుకునట్లు వార్తలు వినపడుతున్నాయి.
విషయం ఏంటి అంటే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను సెర్బియాలో ప్లాన్ చేశారు. మణిరత్నంతోపాటు లీడ్ యాక్టర్లంతా అక్కడికి వెళ్లగా కమల్ హాసన్ అందుబాటులో లేకపోవడంతో షూట్ రద్దయింది. దీంతో డేట్స్ షెడ్యూల్ సెట్ అవకపోవడంతో జయం రవి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే కమల్ హాసన్ సినిమాకు మాత్రం భారీ నష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.