ప్రభాస్‌కు ఆ కర్రీ అంటే పరమ అసహ్యం.. ప్లేట్‌లో వేస్తే రోజంతా భోజనమే మానేస్తారట?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 40 ఏళ్లు దాటినా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. రీసెంట్ గా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సినిమాల విషయం పక్కన పెడితే..
తాజాగా ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. రెబల్ స్టార్ మంచి ఫుడీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉన్నా.. సినిమా షూటింగ్ లో ఉన్నా ఫుడ్ విషయమే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభాస్ కు రొయ్యల బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమట. ఎంత డైట్ లో ఉన్నా సరే వీటిని మాత్రం లాగించేస్తుంటారట.
ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ కు ఇష్టమైన ఫుడ్ గురించే చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ ఆయనకు ఇష్టం లేని ఫుడ్ గురించి ఎవరికి తెలిసుండదు. అయితే రెబల్ స్టార్ కు కాకరకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదట. ఆరోగ్యానికి మంచిదని.. కృష్ణం రాజు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసిన అస్సలు తినేవారు కాదట. ప్లేట్ లో కాకరకాయ కూర వేస్తే ఆ రోజు మొత్తం అన్నం తినకుండా ఉండేవారట.