క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు రికార్డు చేశారు..! రాధిక సెన్సేషనల్ కామెంట్స్

మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ పలు ఇండస్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2024-08-31 06:51 GMT

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ పలు ఇండస్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో చాల మంది సినీ సెలబ్రిటీలు ఈ నివేదికపై రియాక్ట్ అయ్యారు. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కమిటీ వేయాలని సమంత రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసింది. అలాగే అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు హేమ కమిటీపై రియాక్ట్ అవుతూ తమకు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక శరత్ కుమార్ సంచలన కామెంట్స్ చేసింది.

అలాగే ఇలాంటి సంఘటనలు అన్ని ఇండస్ట్రీల్లో జరుగుతున్నాయని తెలిపింది. ‘‘46 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి సమస్యలే మహిళలకు ఎదురవుతున్నాయనుకుంటున్నా. నేను కూడా ఒకసారి ఎదుర్కొన్నా. ఒక సినిమా షూటింగ్ కోసం నేను కేరళ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే.. షాట్ కంప్లీట్ చేసుకొని వెళ్తుంటే.. సెట్‌లో ఉన్న కొందమంది పురుషులు ఒకేచోట చేరి ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. నాకు అనుమానం వచ్చి ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని అడిగాను. దీంతో అతను క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి చూస్తున్నారని చెప్పాడు.

ఆ విషయం తెలిశాక షాక్ అయ్యాను. ఆ తర్వాత ఎంతోమంది వీడియోలు రికార్డ్ చేశారని తెలిసింది. ఈ విషయం మిగతా నటీమణులకు కూడా చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నేను వెళ్లి మూవీ టీమ్‌కు కంప్లైంట్ చేశాను. నా క్యారవాన్‌లో ఏమైనా కెమెరాలు పెట్టినట్లు అనిపిస్తే వారికి తగిన బుద్ధి చెప్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా. అయితే ఇది జరిగిన తర్వాత నుంచి నాకు కారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుంది. కానీ అదే మా ప్రైవేట్ ప్లేస్. అక్కడే కదా మేము దుస్తులు మార్చుకోవడం, భోజనం చేయడం, రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తాము. అలాంటిది అక్కడ కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టడం దుర్మార్గం’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.


Similar News