Namitha: పండగ పూట అలా ప్రవర్తించారు.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ నమిత ఆవేదన (పోస్ట్)
ఒకప్పటి హీరోయిన్ నమిత జెమిని సినిమాతో ఇండస్ట్రీకి సినీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించింది.
దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ నమిత జెమిని సినిమాతో ఇండస్ట్రీకి సినీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఇక నమిత ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా, ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లడంతో ఊహించని అనుభవం ఎదురైనట్లు నమిత ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ‘‘పండగ కావడంతో నా ఫ్యామిలీతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్లాను. అయితే ఆలయంలోకి నన్ను అడ్డుకున్నారు.
అంతేకాకుండా నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అడిగారు. వారు మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. తమిళనాడులో ఉన్న ఎన్నో ఆలయాలకు నేను దర్శించుకున్నాను. కానీ అక్కడ ఇలా జరగలేదు. మధుర మీనాక్షి ఆలయంలో ఉన్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఓ వీడియోను షేర్ చేసింది. ప్రజెంట్ నమిత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన కొందరు నెటిజన్లు క్షమించమని అడుగుతున్నారు. ఇక దీనిపై రియాక్ట్ అయిన ఆలయ పరిపాలన సిబ్బంది.. పై అధికారులు చెప్పడం వల్లే అలా చేశాము. కొంత సమయం వెయిట్ చేయమని చెప్పాము కానీ అడ్డుకోలేదు. మర్యాదగానే మాట్లాడాము అని క్లారిటీ ఇచ్చారు.
(Video Link Credits to namita.official Instagram Channel)