మలయాళంలో కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్ దుమారం

మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం కొనసాగుతోంది.

Update: 2024-08-26 13:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం కొనసాగుతోంది. సీనియర్ దర్శకుడు తులసీ దాస్ మీద నటి గీతా విజయన్ సంచలన ఆరోపణలు చేశారు. 1991లో వచ్చిన 'చంచట్టం' సినిమా షూటింగ్లో తనకు కేటాయించిన హోటల్ రూమ్ తలుపు అర్థరాత్రి చాలాసార్లు తులసీ దాస్ తట్టేవారని అన్నారు. దానిని నేను వ్యతిరేకించగా.. దాంతో తనను తీవ్రంగా వేధించారని, ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించారని గీతా ఆరోపించారు. కాగా తులసీ దాస్ మీద నటి శ్రీదేవికా కూడ నోరు మెదిపారు. 2006 లో తనపై తులసీ దాస్ శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని.. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పైగా తన కెరీర్ పాడై పోయిందని దేవికా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మిను అనే నటి తాను నోబల్, విచూ, ముఖేష్, మనియన్ పిళ్ళ రాజు, ఇడవేలబాబు, జయసూర్య వల్ల వేధింపులు ఎదుర్కొన్నానని ఆరోపించారు. నటి రేవతి సంపత్.. నటుడు, నిర్మాత సిద్దిఖీపై ఆరోపణలు చేయగా.., బెంగాలీ నటి డైరెక్టర్ రంజిత్ బాలక్రిష్ణన్ మీద ఆరోపణలు చేశారు.

మలయాళీ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపుల మీద జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ డొంక కదులుతోంది. కాగా తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆదివారం కాస్టింగ్ కౌచ్ మీద ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులతో కేరళ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ వేసింది.       


Similar News