Samantha: సామ్ ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు.. ఎవరిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. మరి ఇంతకీ పెళ్లి ఎవరిదా అని అనుకుంటున్నారా..? సమంత సోదరుడు డేవిడ్ ప్రభుది. ఆయన వివాహం అమెరికాలో సెప్టెంబర్ 21న ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అయితే డేవిడ్ ప్రభు వివాహం నికోల్‌తో క్రిస్టియన్ పద్దతిలో జరగగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. అలాగే ‘ఫ్యామిలీ’ అనే క్యాప్షన్ ఇస్తూ.. కుటుంబంతో కలిసి గడిపిన అద్భుతమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసింది. ఇక ఈ పిక్స్‌లలో ఊదా రంగు డిజైనర్ గౌన్‌లో సమంత పూలగుత్తి పట్టుకొని వస్తుంటే.. ఆమెనే పెళ్లి కూతురేమో అన్నంత అందంగా ఉంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More...
సినీ ఫీల్డ్ మంచిది కాదు.. వాటికి బానిసవుతుందని భయపెట్టారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
(video link credits to samantha instagram id)