Jabardast : ముగ్గురి జీవితాలతో ఆడుకున్న జబర్దస్త్ ఫైమా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మాజీ ప్రియుడు!

జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ‘పటాస్’ షో‌తో కెరీర్ ఎంట్రీ ఇచ్చిన ఈమె స్మాల్ స్ర్కీన్‌ తెరపై తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Update: 2024-05-14 14:13 GMT

దిశ, సినిమా : జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ‘పటాస్’ షో‌తో కెరీర్ ఎంట్రీ ఇచ్చిన ఈమె స్మాల్ స్ర్కీన్‌ తెరపై తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకుంది. ఇక్కడ కూడా మాస్ డైలాగ్‌‌లతో, బోల్డ్ వాయిస్‌తో అందరినీ మెప్పించి కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఇదే ఫేమ్‌తో ఆమెకు బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం కూడా దక్కింది. అక్కడ కూడా నవ్వులు పూయించి తనేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత స్టార్ మా షోలో కూడా అలరించినప్పటికీ.. మళ్లీ ‘జబర్దస్త్’లోకి రీఎంట్రీ ఇచ్చి అదే జోరు కొనసాగిస్తోంది.

అయితే మొదట్లో ఫైమా తన తోటి కమెడియన్ ప్రవీణ్‌తో కలిసి జబర్దస్త్‌లో అనేక స్కిట్లు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌‌ను ఆడియన్స్ ఫుల్లుగా ఆదరించారు. అప్పట్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు వెలువడగా, ఫైమా కూడా నిజమే అన్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. బిగ్‌‌ బాస్ షోలోనూ రివీల్ చేసింది. ప్రవీణ్ తనకు ఎంతో హెల్ప్‌ చేస్తాడని తెగ పొగిడేసింది. ఏమైందో ఏమో కానీ ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన ఫైమా తమ జోడీ జస్ట్ షో వరకు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ ప్రవీణ్‌తో తనకు రిలేషన్ ఉందో లేదో అనే విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఆ తర్వాత మరో సందర్భంలో స్పందించిన ఫైమా తామిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందుకే విడిపోయామని, అందుకే మాట్లాడుకోవడం లేదని తెలిపింది. అదే సందర్భంలో జబర్దస్త్‌లోకి ఎలా వచ్చారని మరో కమెడియన్ భాస్కర్ అడగ్గా.. రేషన్ కోటా లెక్కలు చెప్తూ ఎంటర్టైన్ చేశాడు ఇంకో కమెడియన్ నరేష్. సరిగ్గా ఈ సందర్భంలో ఫైమా ప్రస్తావన రాగా.. ఆమె ముగ్గురి జీవితాలతో ఆడుకుందని కూడా నరేష్ కామెంట్ చేయడంతో సభలో అందరూ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ నవ్వడం మొదలు పెట్టారు. ఇక ఫైమా కూడా అదే ఎక్స్ ప్రెషన్‌తో స్మైల్ ఇచ్చింది.

ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులకు ఫైమా ప్రవీణ్‌ జీవితంతో ఆడుకుందనే క్లారిటీ వచ్చినప్పటికీ మిగతా ముగ్గురు ఎవరు? అనేది చాలామందికి అంతు చిక్క లేదు. దీంతో నెటిజన్లు ఫైమా అసలు రంగు బయటపడిందని, ఏకంగా ముగ్గురి జీవితాలతో ఆడుకుందని, ఆమె ప్రియుడు కూడా ఒకసారి ఈ విషయాలు తెలిపాడని కామెంట్లు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇదంతా కామెడీ షోలో భాగంగానే జరిగింది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అవుతుండగా జబర్దస్త్ ఆడియన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు.


Similar News