స్టేజ్‌పైనే నటిని ఎత్తుకుని ముద్దు పెట్టిన హీరో.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ అయిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభం అయింది.
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ అయిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు, సినీ తారలు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.. నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో చేసిన పనికి నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన హాలీవుడ్ నటి, సూపర్ మోడల్ జిగి హడిద్‌ను వేదికపైకి ధావన్ పిలిచాడు. ఆమె స్టేజి పైకి ఎక్కగానే.. జిగిని ఎత్తుకుని తన బుగ్గపై ముద్దు పెట్టాడు. అతను చేసిన పనికి ఆమె కాస్త అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘‘ఇలా చేయడం కరెక్ట్ కాదు’’ అంటూ నెటిజన్లు వరుణ్‌పై మండిపడుతున్నారు.
Also Read.. ‘నాటు నాటు’కు అలియా, రష్మిక డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో