OTT Movie: ఆస్కార్ అవార్డును పొందిన మొదటి హారర్ ఫిల్మ్.. ఈ మూవీని చూస్తూ థియేటర్ నుంచి పారిపోయిన జనాలు..

ఆస్కార్ అవార్డును పొందిన మొదటి హారర్ ఫిల్మ్..

Update: 2024-09-11 07:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓటీటీల్లో ఎన్నో సినిమాలు విడులవుతుంటాయి. వాటిలో ఆడియెన్స్ థ్రిల్లర్, దెయ్యాల సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే హారర్ సినిమాలు కొన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.

ఇక ఇతర భాషల సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. కానీ, ఓటీటీలో హారర్ మూవీస్ హవా నడుస్తోంది. కొన్ని ఎంత భయమేసిన చూస్తూనే ఉంటారు. అక్కడే కూర్చొని భయంగా నైన చూస్తూ ఉంటారు. కానీ, ఈ మూవీని చూడాలంటే ఖచ్చితంగా దైర్యం ఉండాల్సిందే.. ఆ మూవీ గురించి ఇక్కడ చూద్దాం..

ఆ మూవీ పేరు ది ఎక్సార్సిస్ట్. బ్రిటన్‌లో ఈ మూవీని నిషేధించారు. విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీ 1973లో రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో 23 థియేటర్స్ లోనే మాత్రమే రిలీజ్ చేసారు. అతి భయంకరమైన ఈ మూవీని కొన్ని చోట్ల ఆపేసారు. ‘ది ఎక్సార్సిస్ట్’ మూవీ ఆస్కార్ అవార్డును కూడా సాధించింది. ఆస్కార్ అవార్డు గెలుపొందిన మొదటి హారర్ సినిమాగా పేరు పొందింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ లో పే చేసి మాత్రమే చూసే అవకాశం ఉంది.

Tags:    

Similar News