ఆ సినిమా షూటింగ్‌లో ఘోరంగా గాయాల పాలైన నటి.. ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎమోషనల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది.

Update: 2024-07-08 05:13 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులోని యాక్షన్ సీన్స్, విజువల్స్, మహాభారతం సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై చాలామంది సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. ఇక మలయాళం హీరోయిన్ అన్నాబెన్ కూడా కల్కి సినిమాలో కైరా పాత్రలో కనిపించి మెప్పించింది. ఒక అరగంట సేపే కనపడినా తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. క్యూట్‌గా మాట్లాడుతూనే యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టేసింది. దీంతో కైరా పాత్ర బాగానే పాపులర్ అయింది. ఇప్పటికే కల్కి లాంటి భారీ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు పలు పోస్టులు పెట్టింది ఈ భామ.

ఈ క్రమంలోనే తాజాగా అన్నా బెన్ కల్కి సినిమా గురించి మరో స్పెషల్ పోస్ట్ చేసింది. కొన్ని వర్కింగ్ స్టిల్స్, కొన్ని తన గెటప్ ఫొటోస్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లో తనకి ఒంటి మీద పలు చోట్ల తగిలిన దెబ్బలు కూడా ఫోటోలు తీసి పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలు షేర్ చేస్తూ అన్నా బెన్.. కైరా పాత్ర రెండేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషించి ఒక కొత్త పాత్ర చేయబోతున్నాను అని ఓకే చెప్పాను. ఈ పాత్ర నా కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని భావించాను. నాగ్ అశ్విన్ గారికి థాంక్స్ చెప్పాలి ఇంత పెద్ద ఇండియన్ సినిమాలో నన్ను భాగం చేసినందుకు. నాగి సార్‌కి ఎంత వర్క్ ఉన్నా రిలాక్స్‌గా ఉంటారు. ఆయన నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడం నాకు గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాలో కైరా పాత్ర నిలిచిపోయినందుకు ధన్యవాదాలు. ఈ షూటింగ్ సమయంలో ఎంతోమంది మంచివాళ్ళని, గొప్పవాళ్ళని కలిసాను. కైరా పాత్రకు మీరంతా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను మరింత ఎక్కువగా కష్టపడతాను అంటూ రాసుకొచ్చింది అన్నా బెన్. ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు అయ్యో కల్కి మూవీ కోసం చాలా కష్ట పడ్డావ్‌గా అని.. ఈ కష్టానికి తగ్గ ఫలితం కల్కి మూవీలో దక్కిందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Similar News