సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం అదే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘క’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘క’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా సుజిత్, సందీప్ టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడంతో.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కిరణ్ అబ్బరం తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు.
‘వరుసగా సినిమాలు చేసి తప్పు చేశాను. ఇప్పుడు అందుకే ఆ తప్పులు సరిదిద్దుకోవాలని అనుకున్నాను. అందుకే ఏడాది గ్యాప్ తర్వాత ‘క’ అనే విభిన్నమైన సినిమా చేశాను. వరుసగా మూవీస్ చెయ్యడం కారణంగా కొత్త లుక్‌లో కనిపించే అవకాశం రాలేదు. అలాగే కొత్త తరహా కథలు ఎంపిక చేసుకోలేక పోయాను. అందుకే ఏడాది గ్యాప్ తీసుకున్నాను. ఈ సినిమాతో నా లుక్ సైతం మార్చుకున్నాను. తప్పకుండా నా నుంచి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్‌ను ఈ కొత్త సినిమాతో ఇవ్వబోతున్నాను. నేను బాగుండాలి, నా నుంచి మంచి సినిమాలు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా 'క' సినిమా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా.. గతేడాది ‘రూల్స్ రంజన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ సినిమాకు ముందు రెండేళ్లలో దాదాపు 6 మూవీస్ చేశాడు. ఈ క్రమంలోనే ‘రూల్స్ రంజన్’ ప్రమోషన్స్ టైంలో తను ఓ ఏడాది పాటు సినిమాలకు గ్యా్ప్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనికి అసలైన రీజన్ తాజాగా ‘క’ ప్రమోషన్స్‌లో రివీల్ చేశాడు కిరణ్ అబ్బవరం.