Taraka Ratna: కల నెరవేరకుండానే అలా జరిగింది.. తారకరత్న మరణంపట్ల కంటతడి పెట్టిన సన్నిహితులు

నందమూరి తారకరత్న మరణంతో సినీ ప‌రిశ్రమ‌ విషాదంలో మునిగిపోయింది.

Update: 2023-02-19 06:39 GMT
Taraka Ratna: కల నెరవేరకుండానే అలా జరిగింది.. తారకరత్న మరణంపట్ల కంటతడి పెట్టిన సన్నిహితులు
  • whatsapp icon

దిశ, సినిమా: నందమూరి తారకరత్న మరణంతో సినీ ప‌రిశ్రమ‌ విషాదంలో మునిగిపోయింది. అతని భౌతిక కాయాన్ని చూడటానికి ఇండస్ట్రీ మొత్తం కదిలివచ్చింది. అయితే తారకరత్న అనుకున్నవి, కోరుకున్నవి కొన్ని జరగలేకపోయాయని, అతని మరణంతో ఇక అవి కలలుగానే మిగిలిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మ‌ద్దతు ఇస్తూ వచ్చిన తార‌క‌ర‌త్న ఈ ఏడాది ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని, ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావించారు. కానీ ఆ క‌ల తీర‌కుండానే క‌న్నుమూశారు. మూవీస్ విషయంలోనూ ఒకటి అలాగే జరిగింది. తన బాబాయ్ బాల‌కృష్ణతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాల‌న్నది తార‌క‌ర‌త్న క‌ల‌. చాలా రోజులుగా మంచి కథకోసం ఎదురు చూస్తున్నారట. కానీ కథ దొరికినా నటించడానికి ఇప్పుడతను లేడని అభిమానులు, సన్నిహితులు, బాధపడుతున్నారు. ఆయన కలలు కలలుగానే మిగిలిపోయాయంటూ కంటతడి పెడుతున్నారు.

Tags:    

Similar News