ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత..

సినీ పరిశ్రమలో ఇటీవల వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2023-02-06 09:31 GMT

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో ఇటీవల వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత మూడు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు కళాతపస్వి K విశ్వనాథ్, ప్రముఖ నిర్మాత గురుపాదం, ప్రముఖ సీనియర్ గాయని వాణీ జయరాం మరణించారు. ఈ మరణ వార్తలను జీర్ణించుకోక ముందే మరో విషాదం నెలకొంది. ఒకప్పటి తమిళ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ TP గజేంద్రన్ (68) తుదిశ్వాస విడిచారు. కాగా సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. 17 సినిమాలు డైరెక్ట్ చేసిన TP గజేంద్రన్.. ఆర్టిస్ట్‌‌గా దాదాపు 100 సినిమాల్లో నటించి మెప్పించారు.


Similar News