Tamannah and Virat Kohli: తమన్నా మాయలో పడిన విరాట్ కోహ్లీ.. నెట్టింట సంచలనం సృస్టిస్తోన్న వీడియో!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇండస్ట్రీకొచ్చి 19 ఏళ్లు దాటుతోన్న చెక్కుచెదరని అందంతో మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంది.

Update: 2024-07-20 14:23 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇండస్ట్రీకొచ్చి 19 ఏళ్లు దాటుతోన్న చెక్కుచెదరని అందంతో మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికీ ఈ అమ్మడు దాదాపు డెబ్బై ఐదు మూవీల్లో నటించడం విశేషం. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది.

అందం, అభినయం, అదిరిపోయే డాన్స్‌తో యువత గుండెల్ని కొల్లగొట్టింది. చాలా మంది అప్పటి హీరోయిన్ల క్రేజ్ పడిపోతున్న తమన్నా క్రేజ్ మరింత పెరుగడం విశేషం. పోను పోను అవకాశాలు ఆకాశన్నంటున్నాయో తప్ప తగ్గడం లేదు. అయితే ఈ మిల్క్ బ్యూటీ అండ్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గతంలో సెల్ ఫోన్‌కు సంబంధించిన ఓ టీవీ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ తమన్నాను ఆటపట్టిస్తూ ఉంటాడు. కోహ్లీ.. తమన్నాను చూసి ఫ్లాట్ కావడం.. తనతో మాట్లాడాలనుకోవడం, విరాట్ ఫోన్ పోయినట్లు నటించి.. తమన్నా ఉన్న సైడ్ వెళ్లి మొబైల్ వెతకడం చేస్తాడు.

‘నా ఫోన్ ఇక్కడో ఎక్కడో ఉండుంటుంది. నా నెంబర్ చెబుతాను ఒకసారి కాల్ చేయండి’ అంటారు. దీంతో తమన్నా ఒకే అని కాల్ చేస్తుంది. అనంతరం తమన్నా మీ నెంబర్ ఇదేనా సేవ్ చేసుకుంటానని అనడంతో విరాట్ తెగ సిగ్గు పడిపోతుంటారు. ఇక ఇద్దరు రొమాంటిక్‌గా చాటింగ్ చేసుకోవడం స్టార్ చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది క్యూట్ అని కొనియాడగా.. మరికొంతమంది కోహ్లీ తమన్నా మాయలో పడిపోయాడంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

Full View


Similar News