‘స్త్రీ-2’లో ఐటమ్ సాంగ్ చేయడానికి భయపడ్డా.. కారణం ఇదేనంటూ తమన్నా కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamanna Bhatia) అందరికీ సుపరిచితమే. మిల్కీ బ్యూటీ గత ఏడాది రజినీకాంత్ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో వా నువ్వు కావాలయ్యా ఐటమ్ సాంగ్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమన్నా స్టెప్పులకు ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా మంత్ర ముగ్దులయ్యారు.
అయితే ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 (Lust Stories-2)అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. అంతేకాకుండా ఇందులో మరీ బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇటీవల తమన్నా స్త్రీ-2 అనే మూవీ ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసి మెప్పించింది. ఈ సినిమా విడుదలై భారీ హిట్ అయింది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టింది. అయితే తమన్నా(Tamanna) చేసిన సాంగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ స్త్రీ-2 (stree-2)ఐటమ్ సాంగ్‌ను ఒప్పుకోవడానికి కారణం ఏంటో రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘జైలర్‌లో నేను చేసిన పాట హిట్ అయినప్పటికీ నేను ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే.. మరోసారి ఐటమ్ సాంగ్ చేస్తే ఆ స్థాయిలో హిట్ అవుతుందో లేదో అని భయపడ్డాను. స్త్రీ-2(stree-2)లో ఐటమ్ సాంగ్ చేయమని మూవీ టీమ్ నన్ను అడిగినప్పుడు భయపడ్డా. హిట్ కాకపోతే మీ సినిమాకే రిస్క్ అని చెప్పా. దీంతో స్త్రీ-2 డైరెక్టర్ కచ్చితంగా హిట్ అవుతుంది అని నాకు ధైర్యానిచ్చాడు. ఆయన నమ్మకం చూసి నేను చేయడానికి ఓకే చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది.