దసరాకు అంటే కష్టం.. ‘గేమ్ చేంజర్’ టీజర్‌పై క్లారిటీ ఇచ్చిన తమన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘గేమ్ చేంజర్’.

Update: 2024-10-08 10:21 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వాని హీరోయిన్ కాగా.. అంజ‌లి, సముద్రఖ‌ని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో.. ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే అందులో నుంచి వచ్చే సాంగ్స్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ‘టీజర్ ఫస్ట్.. సాంగ్స్ నెక్ట్స్.. ముందు టీజర్‌పై దృష్టి పెట్టండి’ అని ఓ పోస్ట్ పెట్టి తమన్‌‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై తమన్ స్పందిస్తూ.. ‘డియ‌ర్ బ్రద‌ర్ మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రోడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే వీటికి టీజ‌ర్ బ్రేక్ వేస్తుంది. మేము ఎంత వేగంగా చేసిని ద‌స‌రా వ‌ర‌కు అవ్వక‌పోతే.. దీపావ‌ళికి ఖ‌చ్చితంగా బ్లాస్ట్ ఉంటుంది. మేము కూడా దీన్ని పార్క్ నుంచి బ‌య‌ట‌కు కొట్టాలి అనుకుంటున్నాం. దీనికోసం అంద‌రూ స‌హక‌రించాల‌ని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. 


Similar News