అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను: సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'.
దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్ణ హీరోయిన్గా నటిస్తుండగా.. సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ.. సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘ఇద్దరు తండ్రులు- ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపన చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయ్యాయి. ఫాదర్ సన్ ఎమోషన్ ఆల్రెడీ ఉంది. అది జనాలకి గుర్తు చేస్తే చాలు. ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే తొలి రెండు సీన్స్‌లోనే కథ ఏమిటనేది ఆడియన్స్‌కి క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఆ సిచువేషన్స్ ఎప్పుడు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇందులో హీరో తండ్రిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఈ ఎమోషన్ నేచురల్‌గా నా నుంచి వచ్చింది. మన అందరికీ సూపర్ హీరో నాన్నే. ఇందులో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్లు చేయకూడదని అనుకున్నాం. కెమరా మూమెంట్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. చాలా నేచురల్‌గా చేయడానికి ప్రయత్నించాం. ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫిల్మ్. రేర్ స్టొరీ. డెఫినెట్‌గా ఆడియన్స్‌కి నచ్చుతుంది. నా కెరీర్లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ సినిమా ఇది. ఫస్ట్ డే నుంచే యునానిమస్‌గా ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది.. ఈ మూవీ 100% హిట్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.