‘అమరన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘అమరన్’.

Update: 2024-10-07 15:41 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో రాహుల్ బోస్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషిస్తుంగా.. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటిస్తుంది. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘అమరన్’ తెలుగు, తమిళంలో దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది.

ఇక విడుదల సమయం దగ్గరపడుతున్న క్రమంలోనే ఇటీవల ఈ చిత్రం నుంచి హీరోయిన్‌గా సాయిపల్లవి పాత్రకు సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇదే జోష్‌లో ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే’ అంటూ సాగుతున్న సూపర్ మెలోడియస్ సాంగ్‌లో శివ కార్తికేయన్‌, సాయిపల్లవి మధ్య ఇంప్రెసివ్‌ కెమిస్ట్రీ మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.


Full View



Similar News