డేటింగ్‌కు వెళ్లిన సీనియర్ హీరోయిన్.. చివరకు అలా అయ్యేసరికి..

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుచిత్రా కృష్ణమూర్తి భర్త డైరెక్టర్ శేఖర్ కపూర్‌తో విడిపోయాక ఒంటరిగానే ఉంటోంది.. Latest Telugu News

Update: 2022-06-15 09:04 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుచిత్రా కృష్ణమూర్తి భర్త డైరెక్టర్ శేఖర్ కపూర్‌తో విడిపోయాక ఒంటరిగానే ఉంటోంది. వీరిద్దరికి పుట్టిన బిడ్డ కావేరీ కపూర్‌ను పెంచుకుంటూ సింగిల్ మదర్‌గా ఉండిపోయింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తానని తెలిపింది.

అయితే తన గురించి ఎక్కువగా ఆలోచించే కూతురు మాత్రం ఒంటరిగా ఉంటున్నానని, డేటింగ్‌కు వెళ్లమని ఫోర్స్ చేసినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే డేటింగ్ సైట్‌లో తన ప్రొఫైల్ అప్‌లోడ్ కూడా చేసిందని చెప్పుకొచ్చింది. డాటర్‌కు ప్రామిస్ చేశాను కాబట్టి పలువురితో డేటింగ్‌కు వెళ్లానన్న ఆమె.. ఆ రిలేషన్ ఫ్రెండ్‌షిప్‌తో క్లోజ్ చేశానని తెలిపింది. ఆ తర్వాత తనకు ఇదంతా సూట్ కాదని చెప్పానన్న సుచిత్ర.. షారుఖ్‌ ఖాన్‌తో 'కభీ హ కభీ నా'లో నటించిన తనకు ఆయనతో ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ రహస్య బంధం ఉంటే లండన్‌లో తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని, తన కూతురు ఆయన పిల్లలు చదివే స్కూల్‌లోనే చదివేదని అభిప్రాయపడింది. 


Similar News