ఇన్‌స్టాలో పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే
రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జూలై 4వ తేదీన ‘ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్’ అనే నినాదంతో ఇన్‌స్టా ఖాతాను తెరిచాడు. ఇక ఆయన ఎంట్రీ ఇచ్చాడో లేదో అభిమాన ఫాలోవర్స్‌తో ఇన్‌స్టా మొత్తం షేక్ అయింది. ఇప్పటివరకు ఫాలోవర్ల సంఖ్య 2.3 మిలియన్లకు చేరింది. ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. పెడితే మాత్రం ఇంకా ఫాలోవర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే రీసెంట్‌గా స్టార్ హీరోయిన్లు శ్రుతిహాసన్, కీర్తి సురేష్ వంటి అందాల తారలు పవన్‌ను ఫాలో అవుతున్నారు. ఇంకా ముందు ముందు ఎంతమంది పవన్‌ను అనుసరిస్తారో చూడాలి.