Sreeleela:‘చుట్టూ చాలా కళ్లు ఉన్నాయి కానీ’.. స్టన్నింగ్ ఫొటోలకు శ్రీలీల అదిరిపోయే క్యాప్షన్

బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు.

Update: 2024-09-14 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో గానీ వరుస చిత్రాలతో సీనియర్ హీరోయిన్లకు చెమటలు పట్టించింది. ఈ అమ్మడు డాన్స్, నటనకు దర్శక, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు. ఏకంగా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి హీరోల సినిమాల్లో చాన్స్‌లు కొట్టేసి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ప్రస్తుతం శ్రీలీలకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు చెక్కేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీలీల ఈ గ్యాప్‌లో శాస్త్రీ బామ్ అనే ఓ యాడ్‌లో కూడా నటించింది. అటు ఇటు తిరుగుతూ నాట్యం చేస్తోన్న అమ్మాయికి పెయిట్ వస్తే బామ్ తెచ్చి ఇస్తుంది. చాలా యాక్టివ్‌గా యాడ్ అదరగొట్టిందనడంలో అతిశక్తిలేదు. ఇకపోతే ఈ కుర్ర హీరోయిన్ తాజాగా ఫొటో షూట్ చేసింది. గ్రీన్ కలర్ శారీ కట్టుకుని, తల ఒక వైపు వంచి.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లను ఆగం చేస్తుంది. ఈ కిర్రాక్ ఫొటోలకు శ్రీలీల ‘చుట్టూ చాలా కళ్ళు ఉన్నాయి కానీ నాకు మీ జంట కళ్ళు ఇష్టం’ అనే క్యాప్షన్ రాసుకొచ్చి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోగా.. బ్యూటిఫుల్, ఫిదా అంటూ గ్రీన్ లవ్ సింబల్స్ జోడించి కామెంట్ల మోత మోగిస్తున్నారు.

Read More....

Sree Leela.. గ్రీన్ శారీలో యంగ్ బ్యూటీ.. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేయకు అంటున్న నెటిజన్స్ 




Full View


Similar News