సోనూసూద్ సినిమాలో ఇటుక బట్టీ కార్మికుడు
కరోనా సమయంలో సోనూసూద్ పేరు మార్మోగింది
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో సోనూసూద్ పేరు మార్మోగింది. తన సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా సోనూసూద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తాను నటిస్తున్న ఫతేహ్ సినిమాలో ఇటుక బట్టీ కార్మికుడికి పాట పాడే ఛాన్స్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్జీత్ అనే యువకుడికి పాటలంటే ప్రాణం. ఇటుక బట్టీలో పనిచేసే అతడు బాలీవుడ్ పాటలు పాడుతూ ఆ వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాడు.
అవే అతడి దశను మార్చాయి. ఇటీవల పాడిన ‘దిల్ దే దియా హై’ పాట వీడియోకు సోషల్ మీడియాలో ఫుల్ రిస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోను పదిలక్షల మందికి పైగా వీక్షించారు. ప్రముఖ నటుడు సోనూసూద్; నటి నీతూ చంద్ర, ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ఆ వీడియోను రీ ట్వీట్ చేశారు. సోనూసూద్ అమర్ జీత్ ఫోన్ నంబర్ తెలుసుకుని మరి మాట్లాడారు. కాగా సినిమాలో పాట పాడే ఛాన్స్ రావడం పట్ల యువకుడి ఆనందానికి అవధుల్లేవ్. త్వరలోనే ఈ పాట రికార్డింగ్ కోసం యువకుడు ముంబాయికి వెళ్లనున్నాడు.