Gossips : రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న సితార.. శ్రీలీల.. సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్న సీతూపాప

ఈ మధ్య సెలబ్రిటీలే కాదు, వాళ్ల వారసులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆసక్తిగల అంశాలపై రీల్స్ చేస్తూ.. డిస్కషన్ పెడుతూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

Update: 2024-05-31 07:20 GMT

దిశ, సినిమా : ఈ మధ్య సెలబ్రిటీలే కాదు, వాళ్ల వారసులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆసక్తిగల అంశాలపై రీల్స్ చేస్తూ.. డిస్కషన్ పెడుతూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సితార ఘట్టమనేని అందరికంటే ముందు వరుసలో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పదేళ్ల వయస్సులోనే సితార పాప ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు డ్యాన్స్ వీడియోలు, అభిప్రాయాలు షేర్ చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా సీతూ పాప పేరెంట్స్ అయిన మహేష్ బాబు, నమ్రతలు కూడా ఫుల్ ఫేమ్ ఉన్న సెలబ్రిటీలు కావడం ఆమెకు మరింత ప్లస్ పాయింట్ అయింది. దీంతో మహేష్ బాబు అభిమానులంతా సితారను ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

చిన్న వయస్సులోనే ట్రెండీ సెలబ్రిటీ లెవల్‌కి ఎదిగిన సితార ఘట్టమనేనితో యాడ్స్ ప్రమోషన్స్ కోసం పలు సంస్థలు, కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే క్లాతింగ్, జ్యువెల్లరీ ప్రమోషన్స్‌లో తళుక్కు‌మంటూ ఎందరినో అలరించింది సీతూ పాప. ఇదంతా పక్కన పెడితే సితార ఘట్టమనేని, ప్రముఖ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. వీరిద్దరూ ప్రతి రోజూ కనీసం అరగంట సేపైనా ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండలేరట.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై అలరించిన మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబుతోపాటు ఈవెంట్‌లో పాల్గొన్న సితారకు అక్కడ శ్రీలీలతో మంచి స్నేహం ఏర్పడింది. అప్పట్లో వీరు ఒకే వేదికపై సందడి చేశారు. పలు సందర్భాల్లో శ్రీలీల.. మహేష్ బాబు ఇంటికి కూడా వచ్చింది. దీంతో శ్రీలీలకు, మహేష్ బాబు ఫ్యామిలీకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పటికీ నమ్రత, మహేష్ బాబు, శ్రీలీల అప్పుడప్పుడూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు. కానీ సితార మాత్రం శ్రీలీలతో రోజూ మాట్లాడుతోందట. పైగా వీరిద్దరూ మహేష్ బాబు కెరీర్, అతని సినిమాల గురించి కూడా మాట్లాడుకోవడమే కాకుండా అతనిపై జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారట. మహేష్ బాబు కెరీర్‌కు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ సీతూపాప శ్రీలీలతో ఓపెన్‌గా చెప్పేస్తుందట. ఇది ఎంత వరకు నిజమో కానీ ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 


Similar News