న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై సింగర్ సునీత.. పుట్టినరోజు నాడు అరుదైన ఘనత

తన గానం మధురం. తాను పాడితే చాలా అలా మైమరిచిపోతారు. ఎవరు ఆ గాయని అనుకుంటున్నారా ? సింగర్ సునీత. టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత అరుదైన ఘనత సాధించారు. ఈ వేళలో నీవు అంటూ.. చిత్ర పరిశ్రమలో

Update: 2024-05-13 06:28 GMT

దిశ, సినిమా : తన గానం మధురం. తాను పాడితే చాలా అలా మైమరిచిపోతారు. ఎవరు ఆ గాయని అనుకుంటున్నారా ? సింగర్ సునీత. టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత అరుదైన ఘనత సాధించారు. ఈ వేళలో నీవు అంటూ.. చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సింగర్ తన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా సింగర్ సునీత తన పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

సునీత పుట్టినరోజును అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సింగర్ సునీత ఫాన్స్.. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో (Times Square Billboard) సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అతి కొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు.

పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్లే చేశారు. మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.


Similar News