సమంతకు అంత ఓవరాక్షన్ అవసరం లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సామ్, కాస్త కోలుకొని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శాకుంతలం మూవీ ట్రైలర్ రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్ : మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సామ్, కాస్త కోలుకొని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శాకుంతలం మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆమె కన్నీరు పెట్టుకుంది. ఇక సమంత అలా భావోద్వేగానికి లోను కావడంతో చాలా మంది ఆమెపై జాలి చూపించారు. కానీ ఓ నిర్మాత మాత్రం సమంత ఏడవడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
నిర్మాత చిట్టి బాబు సమంత గురించి మాట్లాడుతూ.. చాలామంది హీరోయిన్లు ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు. కానీ నీలా మాత్రం ఎవరు ఏడవలేదు. సినిమా అంటేనే కచ్చితంగా అందులో ప్రతి ఒక్కటి చేయగలగాలి. అలా అయితేనే ఇండస్ట్రీలో ఎదగగలరు. అనుష్క దేవసేన, జేజమ్మ వంటి పాత్రలు పోషించింది కానీ ఆమె ఏనాడూ కూడా అలా కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు. నువ్వు మాత్రమే ఏదో ఎక్కువ చేసినట్టు బిల్డప్ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నావ్ ఓవరాక్షన్ చేయడం ఎందుకు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.