న్యూయార్క్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'RRR'!
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'..
దిశ, సినిమా: టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించి అదరగొట్టారు. దీంతో ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఇకపోతే తాజాగా,ఈ సినిమాని న్యూయార్క్‌లో బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయినటువంటి టీసీఎల్ చైనీస్ థియేటర్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌ని వేశారు. దీంతో ఈ షోలో టికెట్స్ ఓ రెంజ్‌లో అమ్ముడుపోయాయి. అది కూడా జస్ట్ 98 సెకండ్స్‌లోనే మొత్తం థియేటర్‌లో సీట్లు అన్నీ అమ్ముడుపోయాయట. ఇలా ఈ మూవీకి జరిగినట్టుగా ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమాకి కూడా జరగలేదంట.
Read more: