అదిరిపోయిన ‘ఫుల్ బాటిల్’ టీజర్.. రూట్ మార్చేసిన సత్యదేవ్

టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’.

Update: 2023-05-28 07:44 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ ప్రకారం సినిమాలో సత్యదేవ్ బాలయ్య ఫ్యాన్‌గా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పూర్తిగా మందు కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. సత్యదేవ్, బ్రహ్మాజీ ఇద్దరి మధ్య ఫన్నీ డైలాగ్ డెలివరీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు విలన్‌గా నటించిన సత్య ఈ మూవీలో మొత్తం తన రూట్ మార్చేశాడని తెలుస్తోంది.

Tags:    

Similar News