Shanvi Srivatsava: ‘లవ్ లీ’ బ్యూటీ అందాల జాతర.. ఆ ఫోటోలు వైరల్

గ్లామర్ ఇండస్ట్రీలో వ్యక్తిగత ఆసక్తులు, సామాజిక కోణాలకంటే.. ఆడియెన్స్‌ ఏం కోరుకుంటారనే దానికే ప్రయారిటీ ఇస్తుంటారు నటీ నటులు.

Update: 2024-07-27 07:26 GMT

దిశ, సినిమా : ‘గ్లామర్ ఇండస్ట్రీ అంటే ఆ మాత్రం ఉండాలి’ అని ఎందుకంటారో తెలుసా?.. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక.. ఇక్కడ వ్యక్తిగత ఆసక్తులు, సామాజిక కోణాలకంటే.. ఆడియెన్స్‌ ఏం కోరుకుంటారనే దానికే ప్రయారిటీ ఇస్తుంటారు చాలామంది. అలాంటి నటీ నటులే ఎంటర్టనైన్మెంట్ రంగంలో నాలుగు కాలాలపాటు నిలదొక్కుకోగలుగుతారని కూడా చెప్తుంటారు. అలా తెలుగుతోపాటు ఇతర భాషా చిత్రాల్లో సత్తా చాటి మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో శాన్వీ శ్రీవాత్సవ ఒకరు.

యూపీలోని వారణాసిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. లేడీ డైరెక్టర్ బి. జయ డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ లీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఆకట్టుకోవడంతో ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సుశాంత్‌‌కు జోడీగా ‘అడ్డా’లో నటించి మెప్పించిన శాన్వీ.. ఇక టాలీవుడ్‌లో చివరిగా ‘రౌడీ’.. ‘ప్యార్ మే పడిపోయా’ సినిమాల్లో నటించి కోలీవుడ్‌కు చెక్కేసింది. ఏమైందో కానీ అక్కడ కొన్ని సినిమాలు చేసిన తర్వాత 2014 నుంచి ఇక ఏ సినిమాలోనూ కనిపించలేదు శాన్వీ శ్రీవాత్సవ.

కాకపోతే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండే శాన్వీ శ్రీవాత్సవ ఈ మధ్య హాటెస్ట్ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ పోరగాల్ల కంటిమీద కునుకులేకుండా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. నాడు చబ్బీగా కనిపించిన.. ఈ అందాల భామకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘లవ్ లీ’ బ్యూటీ.. అందాల జాతర మామూలుగా లేదుగా.. అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు సినీ లవర్స్.

Tags:    

Similar News