నాకు తెలియకుండానే ప్రేమలో పడ్డాను: సంయుక్త మీనన్
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం 'సార్'.
దిశ, సినిమా: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేఖర్లతో ముచ్చటించిన సంయుక్త..
'2016 లో మొదటి సినిమా చేశా. సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలనుకోలేదు. నటిగా సంతృప్తినిచ్ఛే ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నప్పటికీ.. విధి మళ్లీ నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నా. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్లో ఉత్తమ దశ అనిపించింది. వెంకీ గారు ఈ కథ చెప్పగానే ఖచ్చితంగా చేయాలనిపించింది. పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ధనుష్‌కు పెద్ద అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది' అంటూ వివరించింది.
Also Read..
ఆడపిల్లలున్న ప్రతీ కుటుంబం 'మిస్టర్ కింగ్' చూడాల్సిందే: మేకర్స్