ఆటో మీద సమంత.. తనను తానే ఫాలో అవుతున్న వీడియో వైరల్ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన

Update: 2024-05-19 06:33 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరస సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత ట్రోలింగ్ అవ్వడంలో కూడా ముందే ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత ఈ అమ్మడుపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సమంత పేరు మీద న్యూస్ లేని రోజే లేదంటే మనమే అర్థం చేసుకోవచ్చు. ఆమె గురించి ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది.

అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? సమంత తన ఇన్ స్టాలో ఓవీడియోను పోస్ట్ చేసింది. అందులో సామ్ తన కారులో ప్రయాణిస్తుండగా, తన ముందు ఓ ఆటో వెళ్తుంది. ఆ ఆటో మీద సమంత అడ్వర్టైజ్ చేసిన తన ఫోటో ఉంటుంది. ఇక దానిని వీడియో తీసి దాన్ని సమంత పోస్ట్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్స్ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరమో ఏంటీ సమంత తనను తానే ఫాలో అవుతుంది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దానిపై ఓ లుక్ వేయండి.


Similar News