మళ్లీ ప్రేమలో పడిన సమంత..అతనికి ఐ లవ్ యూ చెబుతూ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత అక్కినేని నాగచైతన్యను

Update: 2024-05-17 07:59 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిదే. అప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంతకు సంబంధించిన ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అయితే గతంలో సమంతకు, ప్రీతమ్‌కు ఎఫైర్ ఉన్నదంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల పాటు ప్రీతమ్ సమంతకు దూరంగానే ఉన్నాడు. ఇక మెల్లి మెల్లిగా వీరి గురించి కూడా జనాలు ట్రోల్ చేయడం ఆపేశారు. అయితే తాజగా సమంత చేసిన ఓ పోస్టు విమర్శలకు దారి తీస్తోంది. అసలేమైదంటే? సమంత తాజాగా ప్రీతం జుక్కల్కర్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ.. ఐ లవ్ యూ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది.

హ్యాపీ బర్త్డే బేబీ బాయ్, నీతో పాటు నువ్వు ఉన్న ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్స్ యూ , ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్ సమంత ఏంటి విషెస్ చెప్పాలి కానీ లవ్ యూ అని చెప్పింది. అంటే అంటే సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. అప్పటిదే కంటిన్యూ చేస్తుందా అని నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఎవరికైనా  ఐ లవ్ యూ అని చెప్పవచ్చని.. అది కేవలం ప్రేమికులు మాత్రమే చెప్పుకునే పదం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Similar News