పూర్తిగా క్షీణించిన Samantha ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రాణాంతక వ్యాధి అయిన మయోసైటీస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2022-11-23 03:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రాణాంతక వ్యాధి అయిన మయోసైటీస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక యశోద మూవీ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్, తన ఆరోగ్యం గురించి చెబుతూ కన్నీటి పర్యాతం అయ్యింది.

కాగా, సమంతకు ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మయోసైటీస్ వ్యాధితో చాలా ఇబ్బంది పడుతున్న సామ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. సమంత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిదని, ప్రస్తుతం సామ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారికమైన క్లారిటీ లేదు. సమంత స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు, ఆవేదన వ్యక్తం చేస్తూ, సామ్ త్వరగా కోలుకోవాలని దేవున్నిప్రార్థిస్తున్నారు. 

Read more:

1.Masooda సినిమా హిట్టు కొట్టి..బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకెళ్తుంది !

Tags:    

Similar News