సమంతను జైలులో పెడుతా.. డాక్టర్ వార్నింగ్‌పై రియాక్ట్ అయిన సామ్

కొన్నాళ్లుగా ఆటోఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత.. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంది. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్

Update: 2024-07-05 05:50 GMT

దిశ, సినిమా: కొన్నాళ్లుగా ఆటోఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత.. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంది. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ ఇలా చాలా ప్రయత్నించింది. ఆ పరిస్థితి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందింది. అయితే ముందుగా ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్న తను.. తనలాగే అందరూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేరు కదా అని, తను ఈ పొజిషన్ లో ఉండటం దేవుడు ఇచ్చిన వరమని భావించింది. ఇలా బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ పరంగా ఏదైతే బాగుంటుందో గైడ్ చేసేందుకు తను ఫాలో అయిన థెరపీలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకొచ్చింది.

అయితే దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో స్పందించిన ఆమె.. పెద్ద నోట్ షేర్ చేసింది. తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. ఆయన పేరు కూడా గర్వంగా స్టోరీస్ లో పెట్టింది. తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తన డాక్టర్ తో డిబేట్ కు వచ్చి ఉంటే గొప్పగా ఉండేది. కానీ ఇలాంటి మెసేజ్ తో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ గా చెప్పింది. తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచన అస్సలు లేదని చెప్పింది సామ్. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు తనకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేసేందుకు తను డాక్టర్ కాదని, అయినా తనకు వర్క్ చేసిన మెడిసిన్ ఇతరులకు కూడా వర్క్ చేస్తుందనే గ్యారంటీ లేదు కదా అంటున్నారు.


Similar News